16 July, 2026 | 1:46 AM

నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు

16-07-2026 01:38 AM

మోటివేషనల్ స్పీకర్ లయన్ సరికొప్పల. నాగేశ్వరరావు

నేరేడుచర్ల, జూలై 15 : నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నైపుణ్య దినోత్సవ సందర్బంగా విద్యార్థుల కోసం ప్రేరణాత్మక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరియు మోటివేషనల్ స్పీకర్ లయన్ సరికొప్పల నాగేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.

నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలనుఅధిరోహించవచ్చని తెలిపారు. ఆధునిక కాలంలో విద్యతో పాటు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమని వివరించారు.ఈ కార్యక్రమంలో స్పందన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నళిని,లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, క్లబ్ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, లాయర్ విశ్వనాథ్, గంధం సావయ్య,కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.