calender_icon.png 4 August, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యతో బహిరంగ చర్చకు సిద్ధం: కర్రే ప్రవీణ్

04-08-2025 01:14:38 AM

కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ 

యాదగిరిగుట్ట, ఆగస్టు 3 (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గౌరవ ఆలేరు MLA గారు ఇందిరమ్మ ఇల్లులు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం BRS వాళ్ళకి ఇస్తున్నాం అని డబ్బా కొడుతూ సోషల్ మీడియా లో గొప్పలు చెప్పుకుంటున్నారు.

ఇలాంటివి మీరు ఆపేస్తే మంచిది జనాలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి ఈ నేపద్యంలో ఇందిరమ్మ ఇండ్ల   5 లక్షల రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గు  చేటని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వంPMAY  స్కిం క్రింద 2,50 000 రూ. ఇస్తుందని కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 5 లక్షల రూ. ఇస్తుందని స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పుకుంటారని  ఇది తెలియకుంటే ప్రభుత్వ ఫీల్ ఆఫీసర్ లను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

ప్రభుత్వ ఫీల్ ఆఫీసర్ లు PMAY ఆప్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారా లేదా&దీనిపై బిజెపి పార్టీ తో బహిరంగ చర్చకు ఆలేరు ఎం ఎల్ ఏ  సిద్ధమా అని కర్రె ప్రవీణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే NFBS పథకం లో వచ్చే 20000 కూడా మావే అని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోవడం సిగ్గు చేటు బీజేపీ కండువా లు వేసుకొని మీరు చెక్కులు పంచితే బాగుంటుంది అని ఎద్దేవా చేశారు.

సంబదింత అధికారులు కాగ్రెస్ కార్యకర్తలకు అ చెక్కులు ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. ఇట్టి కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శులు మందోజు నరేష్, జిల్లా భాను చందర్,కార్యదర్శి లు దొమ్మాట ప్రభాకర్, ఆవుల సత్యనారాయణ, ఆలేటి కర్ణ, సీనియర్ నాయకులు కర్రే లక్ష్మయ్య, బోడ బుచ్చి బాబు,వంశీ,సుధగాని శివ,బొమ్మ కుమార్, విజయ్, సంద ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.