calender_icon.png 4 August, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు

04-08-2025 01:12:57 AM

నల్గొండ క్రైమ్ ఆగస్టు 3 : కనగల్ మండలంలో బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చండూరు సిఐ అది రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరి వద్దనుండి ఒక మోటార్ సైకిల్, 20-బ్యాటరీ లు, 24 వేల నగదు,దొంగతనానికి ఉపయోగించే ఒక బజాజ్ ఆటో, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

గత కొన్ని రోజుల క్రితం కనగల్ మండల పరిధిలో మోటర్ వాహనాల దొంగతనాలు, ట్రాక్టర్, ఆటో లలో బ్యాటరీలు దొంగతలనాకు పాల్పడుతున్నారనీ పిర్యాదులు రావడం తో కనగల్ ఎస్.ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీ లు నిర్వహిస్తుండగా నల్లగొండ నుండి దేవరకొండ వెళ్తున్న ఆటో మోటర్ సైకిల్స్ తనిఖీ చేయగా ఆటోలో 20 బ్యాటరీలు, మోటర్ సైకిల్స్ చోరీ చేసినట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొనీ విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు.

నల్గొండ పట్టణంలోని గొల్లగూడెం చెందిన సముద్రాల కృష్ణ, ఉస్మాన్ పుర కు చెందిన టిప్పు సుల్తాన్ లు కలిసి చోరీ లకు పాల్పడుతున్నట్టు వివరించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ ఐ కె రాజీవ్ రెడ్డి , M రవీందర్ రెడ్డి వెంకన్న, శేఖర్, సురేశ్, రమేశ్, వెంకట్ రెడ్డి లను సీఐ కె ఆది రెడ్డి అభినందించారు.