calender_icon.png 4 August, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లను కట్టనివ్వం

04-08-2025 01:15:39 AM

-నా లేఖకు స్పందించే ఏపీ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది 

-క్యాబినెట్ భేటీలో కాళేశ్వరం రిపోర్టును పెడుతాం l ఆ తర్వాత బీఆర్‌ఎస్ నేతల పరిస్థితి ఏమవుతుందో? 

-గోదావరిలో 968 టీఎంసీల వాటా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం 

-నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ 

-రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం 

-హాజరైన మంత్రులు దుద్దిళ్ల, తుమ్మల, పొన్నం 

రామగుండం, ఆగస్టు 3: బనకచర్లను ఆపేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎలాంటి సాహసమైనా చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు బనకచర్లపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శిం చారు. తాను రాసిన లేఖకు స్పందించే బనకచర్లపై ఏపీ ప్రతిపాదనను కేంద్రం తిరస్క రించిందని పేర్కొన్నారు.

కాగా క్యాబినెట్ భేటీలో కాళేశ్వరం రిపోర్టును పెడుతామని, ఆ తర్వాత బీఆర్‌ఎస్ నేతల పరిస్థితి ఏమవుతుందోనని తెలిపారు. కాళేశ్వరం ప్రాజె క్టును బీఆర్‌ఎస్ హయాంలోనే కట్టారని, కూలింది కూడా వారి హయంలోనే అని  ఎద్దేవాచేశారు. నిర్మాణంలో లోపాలతోనే మేడిగడ్డ కూలిపోయిందని పేర్కొన్నారు. ఆది వారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని గోలివాడ వద్ద రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌తో కలిసి ప్రారంభించారు.

అనంతరం అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి నది లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగిం చుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు కోటీ పది లక్షల రూపాయలు మంజూరు చేశామ ని అన్నారు.

రామగుండం ఎత్తిపోతల పథ కం ద్వారా 75 కోట్లు ఖర్చు చేసి అంతర్గాం, ముర్మురు, బ్రాహ్మణ పల్లి ,ఎల్లంపల్లి సోమనపల్లి, మద్దిరాల , తొట్యాల పురం మొద లగు గ్రామాలకు, 17 ఎల్ ద్వారా కుక్కల గూ డూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13 వేల పైగా ఎకరాలకు నీరు చేరుతుందని అ న్నారు. రా ష్ర్ట ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి సైతం శ్రీధర్‌బాబు  సలహాలు సూచనలు తీసుకుంటారని చెప్పారు. 

మహిళల అభివృద్ధికి కృషి: మంత్రి శ్రీధర్‌బాబు

మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. బండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో అ నేక ధర్నాలు చేశామని అన్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వాల తప్పిదాలను సరి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేస్తే మన ప్రాం తంలో ఒక ఎకరా కు సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు.

టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగు నీరు స్థిరికరణ కోసం పత్తిపాక రిజర్వాయర్ ఎన్ని కోట్ల ఖర్చు చేసినా నిర్మిస్తామని, కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేసే సర్వే కు ఆదేశాలు జారీ చేశామని అన్నా రు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం వల్ల 2 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకర ణ,10 వేల ఎకరాల నూతన ఆయకట్టు సృ ష్టించేందుకు అవకాశం ఉంటుందని అన్నా రు. రామగుండం ప్రాంతంలో ఎన్టిపిసి, సిం గరేణి, ఆర్.ఎఫ్.సి.ఎల్ , కేశారాం సిమెంట్ వంటి పరిశ్రమలు ఉన్నాయని , ఇక్కడ ప్రైవే ట్ పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేస్తామని అన్నారు.

ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న సింగరేణి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తామని అన్నారు.  లారీ యాజమాన్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి రిపోర్ట్ అందించాలని మంత్రి కలెక్టరుకు సూచించారు. రామగుండం ప్రాం తంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.

తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూ స్తుందని, గోదావరి పేపర్ మేనేజ్మెంట్ బో ర్డు నుంచి సీడబ్ల్యూసీ వరకు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నామని మంత్రి తెలిపారు. మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ.. రేషన్ కార్డులు మహిళా సంఘాల కు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులందరికీ పంపిణీ చేస్తామని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎండి సివిల్ సప్లు చౌహాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.