calender_icon.png 7 July, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాటినం ఇవారాతో రెడీ.. ఈజీ

06-12-2024 02:43:12 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పండుగ సీజన్‌లో సులభంగా రెడీ అయ్యేలా ప్లాటినం ఇవారా అద్భుతమైన డిజైన్లను రూపొందించింది. తాము రూపొందించిన ప్లాటినం బ్యాంగిల్స్, బ్రేస్‌లెట్స్, ఇయర్‌రింగ్స్, రింగ్స్, పెండెంట్స్‌తో తక్షణమే ఎలివేట్ అయ్యేలా ఉంటుందని ఆసంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో పగలు, రాత్రి సులభంగా ట్రాన్సిషన్ అయ్యే స్టేట్‌మెంట్ లుక్స్‌ను సృష్టించవచ్చని.. పండుగల సందర్భంగా మంచి దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే సమయం ఉంటుందన్నారు. ప్లాటినమ్ ఇవారాలోని ఆభరణలు పరిపూర్ణమైన ఎంపిక అని చెప్పారు.

తమ వద్ద గల ఆభరణాలను 95శాతం నాణ్యమైన ప్లాటినమ్‌తో రూపొందించినట్లు వారు వివరించారు. తమ వద్ద ప్లాటినమ్ డ్రాప్స్ నెక్లెస్, ప్లాటినమ్ బడ్స్ బ్రేస్‌లెట్స్, ప్లాటినమ్ బోల్డ్, బ్యూటిఫుల్ నెక్లెస్, ప్లాటినమ్ మోజాయిక్ మెడ్లీ నెక్లెస్, ప్లాటినమ్ ప్రెషియస్ పెలెట్స్ బ్రేస్లెట్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.