calender_icon.png 7 July, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభం ఉండేలా పరిశ్రమలు నడపాలి

06-12-2024 02:48:28 AM

* ఐఎఫ్‌సీ ఇండియా హెడ్ వెండీవెర్నర్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5(విజయక్రాంతి): సుస్థిరత, లాభదాయకత కలిపి ఉండేలా పరిశ్రమలను నడపాలని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ), వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇండియా కంట్రీ హెడ్ వెండీ వార్నర్ అన్నారు. నగరంలోని అవాసా హోటల్‌లో తెలంగాణ ఫిక్కీ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సస్టునబుల్ ఫ్యూచర్, నెట్ జీరో డైలాగ్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా వెండీ వార్నర్ పాల్గొని మాట్లాడుతూ గతంలో వ్యాపారాలు కేవలం షేర్‌హోల్డర్ విలువలపై దృష్టి పెట్టేవని, కానీ నేడు సుస్థిరత, లాభదాయకత రెండింటిని కలిపి ముందుకు వెళుతున్నాయన్నారు.

గౌరవ అతిథిగా ముంబైలోని ఫిన్లాండ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ ఆఫ్ హల్స్రామ్ హాజరై సభను అభినందించారు. సమావేశంలో గ్రీన్ కో గ్రూప్ అధ్యక్షుడు మహేశ్ కొల్లి, ఫిక్కీ రాష్ట్ర కో చైర్మన్, వీవీ రామరాజు, జాతీయ కో చైర్మన్ డా.పి.రాంబాబు, ప్రముఖ విధాన రూపకర్తలు, కార్పొరేట్ అధిపతులు, స్థిరత నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.