8 July, 2026 | 3:29 AM

జనవరి చివరినాటికి ఆర్‌క్యాప్ టేకోవర్ పూర్తి

16-12-2024 12:18 AM

* హిందుజా గ్రూప్

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వచ్చే జనవరిచివరినాటికల్లా రిలయన్స్ క్యాపిటల్ టేకోవర్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు హిం దూజా గ్రూప్ తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ దివాళా పరిష్కార ప్రక్రియకు సంబం ధించి అనుమతులు లభించాయని, మిగిలిన రెండు, మూడు అనుమతులు పొందిన తర్వాత జనవరి చివరికల్లా రిలయన్స్ క్యాపిటల్ హిందుజా గ్రూప్‌లో భాగమవుతుం దని ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్)  చైర్మన్ అశోక్ హిందూజా తెలిపారు. దివాళా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్ క్యాపిటల్‌ను రూ.9,650 కోట్లకు బిడ్ చేసి ఐఐహెచ్‌ఎల్ పొందింది. 

ఆర్‌క్యాప్ షేర్ల డీలిస్టింగ్ జరిగిన తర్వాత ఆ కంపెనీ రుణదాతలకు సొమ్ము చెల్లిస్తామని హిందుజా వెల్లడించారు. రిలయన్స్ క్యాపిటల్‌ను టేకోవర్ చేసుకున్న తర్వాత మూడేండ్ల పాటు ఎన్సీఎల్టీ అనుమతుల ప్రకారం అదేపేరుతో కంపెనీని నడుపుతామని, ఆ తర్వాత ఇండస్‌ఇండ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. రిలయన్స్ క్యాపిటల్‌కు రిలయన్స్ నిప్పన్‌లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ మనీ, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితర సబ్సిడరీలు ఉన్నాయి. టేకోవర్ తర్వాత ఆర్‌క్యాప్‌కు ఉన్న 39 సబ్సిడరీల్లో కొన్నింటిని ఐఐహెచ్‌ఎల్ విక్రయించాలని యోచిస్తున్నది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) వ్యాపారంపై దృష్టి పెడతామని హిందూజా వివరించారు.