calender_icon.png 18 February, 2026 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్, బిజెపి మధ్య కుదిరిన సయోద్య

18-02-2026 04:13:28 PM

 మొదటి రెండేళ్లు బీఆర్ఎస్ మరో మూడేళ్లు బీజేపీ

అధికార పంపిణీ

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడి రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇంతవరకు రాజీపడని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రకటించాయి. మంగళవారం రెండవసారి వాయిదా పడిన ఎన్నిక బుధవారం బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి అధికార కాంగ్రెస్కు అధికారం చిక్కకుండా తమ మధ్య సయోధ్య కోసం ప్రయత్నం చేసినట్లు ఇరు పార్టీల నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆ పార్టీ మాజీ జెడ్పిటిసి రాథోడ్ రాము నాయక్ మాట్లాడుతూ బిజెపి బీఆర్ఎస్ పార్టీల అధిష్టానం నిర్ణయం మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించిన విధానానికి కృతజ్ఞతలు తెలుపుతూ టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లుగా మొదటి రెండేళ్లు తమ పార్టీ కౌన్సిలర్ తాళ్లపల్లి రాజ గంగన్నకు చైర్మన్ పదవి, బిజెపికి వైస్ చైర్మన్ ,ఇరు పార్టీలకు రెండు, రెండు కోఆప్షన్ పదవులను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ వాల్ సింగ్ ,వసంత్, సంద రాకేష్ ,తదితరులు ఉన్నారు.