calender_icon.png 18 February, 2026 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బే షరతుగా షబ్బీర్ అలీకి క్షమాపణలు చెప్పాలి

18-02-2026 04:18:57 PM

- కామారెడ్డి అభివృద్ధి కోసం పాటుపడాలి

- షబ్బీర్ అలీ నీ విమర్శించే స్తాయి ఎమ్మెల్యే రమణారెడ్డికి లేదు

- నిజాయితీపరుడు అయితే నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

- మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అని విమర్శించే స్తాయి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డికి లేదని దోమకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ మాట్లాడుతూ  రాజకీయ భిక్ష పెట్టింది షబ్బీర్ అలీ  అని మర్చిపోయిన సంగతి గుర్తు చేశారు.

గతంలో షబ్బీర్ అలీ కౌన్సిలర్గా ,జడ్పిటిసిగా టికెట్లు ఇచ్చిన నాయకుడిని తయారు చేసింది మర్చిపోయావా అని హేళన చేశారు. షబ్బీర్ అలీ రాజకీయాల్లో  మచ్చలేని పేజీ అని అన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కామారెడ్డి అభివృద్ధి పై మాట్లాడాలని అవినీతిపై మాట్లాడితే  నిరూపించే శక్తి ఉండాలని సాక్షాదారాలు ఉంటే బయటపెట్టి నిందితులుగా ప్రజల ముందు నిలబెట్టాలని హితువు పలికారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని మరిచి యాక్టర్ లాగా డైలాగులు కొట్టడం కాదన్నారు.

రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు చేసిందేమీ లేదని తన ధ్యాస అంత ప్రోటోకాల్ అంటూ పబ్బం గడపడమే ఆయన పనితీరు అని గుర్తు చేశారు. రాజకీయ కుటుంబం నుండి అసభ్యకర పదజాలం మాట్లాడడం  సమంజసం కాదన్నారు. జెడ్పి చైర్మన్ పదవి కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దకి తీసుకెళ్లింది షబ్బీర్ అలీ నే  అలాంటి నాయకుడిపై బురద చల్లడం  సరైన పద్ధతి కాదన్నారు. షబ్బీర్ అలీ పరిచయాలు చేయడం వల్లనే రాజకీయాల్లో పదవులను  అనుభవించిన సంగతి మర్చిపోయావా అని  నాయకులు రమణారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మచ్చ లేనటువంటి  నాయకుడు షబ్బీర్ అలీ అని అలాంటి నాయకుడిని మరొకసారి మాట అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి షబ్బీర్ అలీపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా బూతు పురాణం మొదలు పెడతామని  తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, జిల్లా కార్యదర్శి తాటిపల్లి శ్రీకాంత్,స్వామి, గోపాల్ రెడ్డి, నల్లపు శ్రీనివాస్, నర్సారెడ్డి, సర్పంచ్ సంజీవ్, నయీమ్ నరేష్ సుధాకర్ మల్లేశం కలీం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.