calender_icon.png 29 May, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణలో ప్రభుత్వ భూమి

27-05-2025 12:00:00 AM

రక్షించాలని చింతపల్లి తహసీల్దార్‌కు తీరేడు ప్రజల విజ్ఞప్తి

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): తీరేడు గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి రక్షించాలని గ్రామప్రజలు చింతపల్లి తహసీల్దార్‌ను కోరారు. తీరేడు గ్రామంలోని సర్వే నెంటా కాల్లకుంట కిం ద 20 గుంటల భూమిలో మాజీ సర్పంచ్ వెంకట నర్సింహరావు బోర్ వేసి, పైపులైన్ ద్వారా గ్రామంలోని వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చారు. ఈ భూమి పక్కన 3/2లో ప్రభుత్వ భూములు ఉన్నాయి.

ఈ ప్రభుత్వ భూమిలోని సర్వేనెంబరు 3/61/ఆ లోని భూమిలోదాసం మారయ్య.. బోర్ పక్కనే బోర్ వేసి, కడీలు నాటాడు. ఈ భూమిలో నక్షబాట కూడా ఉన్నది. ఈ బాట చుట్టూ ఈ నెల 25న మారయ్య కడీలు నాటాడు. గతం లో ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అడ్డుకోగా దాసరి మారయ్య గడ్డపారతో దాడి చేయగా కాయితి ఋచ్చిరె డ్డి గాయపడి ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు.

మారయ్యపై కేసు కూడా నమో దైం ది. ప్రభుత్వ భూమిని, బోర్లను, పైపులైన్‌ను, నక్షబాటను ఆక్రమించుకున్న దాసరి మారయ్యపై చర్యలు తీసుకొని, కడీలను తొలగించి న్యాయం చేయగలరని తీరేడు ప్రజలు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజే శారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వీరమల్లు శ్రీనివాస్, వీరమల్లు వెంకటయ్య, ఎం సురేష్, ఎం రాములు తదితరులు ఉన్నారు.