30 May, 2026 | 10:11 PM

Breaking News

పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •   పొగాకు ఆరోగ్యానికి హానికరం   •   అచ్చంపేట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు   •   ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు   •   వరద సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించిన యూఎస్‌టీ సంస్థకు జిల్లా కలెక్టర్ ప్రశంస   •  

రికార్డు స్థాయిలో పంట కొనుగోలు

30-05-2026 09:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యతను చేపట్టిందని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 1,61,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఒకటి. 45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను గోదాములకు తరలించడం జరిగిందన్నారు.

జిల్లాలో మొక్కజొన్న వరి జొన్న పంటలు పురుగులను పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టడం వల్ల రైతులకు ఇలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. గత 15 రోజుల నుంచి పంట కొనుగోళ్ల వేగవంతం చేయడంతో మరో రెండు మూడు రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు ముగించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున పంటను పంట కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని ఇది రైతుల ప్రయోజనం కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ డి పి ఆర్ ఓ విష్ణువర్ధన్ మార్పిడ్ అధికారి మహేష్ అధికారులు పాల్గొన్నారు.