30 May, 2026 | 9:59 PM

బిఆర్ఎస్ కార్యకర్త రెండు కాళ్లు కోల్పోవడంతో పరామర్శించిన మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్యేలు

30-05-2026 09:28 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అచ్చయ్యపల్లి రాజు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లేవారు. దురదృష్టశాతు గత ఐదు సంవత్సరాల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఒక కాలు తీసివేయడం జరిగింది. అలాగే మరల ఇంకో కాలును కోల్పోవడం జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, జనార్ధన్ గౌడ్ల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్త ఇంటికి వెళ్లి మనోధర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఉండాలని ధైర్యం నింపారు. బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అండగా ఉంటారని తెలిపారు.