రికార్డు స్థాయిలో జూ పార్కు సందర్శకులు
27-05-2024 01:06 AM
చార్మినార్, మే 26 : నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఆదివారం రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారు. ఉదయం నుంచి టికెట్ బుకింగ్ కౌంటర్లు సందర్శకులతో కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజు 30,361 మంది జూ పార్కును కుటుంబ సమేతంగా సందర్శించారు.






