నాలాపై అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి
పరిగి, మే 26 : పరిగి మున్సిపల్ పరిధిలోని నాలలపై యథేశ్చగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు తమకేమి తెలియనట్లు చూసి చూడనట్లు వ్యవ హరిస్తున్నారని బీసీ కాలనీ వాసులు ఆరోపించారు. నాలాలపై నిర్మాణాలు చేయడం వల్ల చిన్న వర్షం కురిసినా, వర్షం నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని చెబుతున్నారు. నాలాల దగ్గర గృహనిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడం లేదని స్థానికులు విమర్శించారు.
ఇదే విధంగా గృహనిర్మాణాలు చేపడితే రానున్న రోజుల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, మున్సిపల్ అధికారులు పునరాలోచించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం వలన పరిగి అభివృద్దికి దెబ్బతినే అవకాశముందని వాపోయారు. నాలాపై అక్రమ నిర్మాణాలపై పరిగి ఎమ్మెల్యే టి రామ్మో హన్ రెడ్డి దృష్టి సారించాలని కాలని వాసులు కోరారు. మైత్రి కాలనిలో ఏకంగా (1000) వెయ్యి మీటర్లు నాలను వార్డు కౌన్సిలర్ కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ కలుగచేసుకోవాలి
పరిగి మున్సిపాలిటీలో నాలాలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ పూర్తి స్థాయిలో ద1ష్టి సారించాలి. అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలి.
సిపిఐ నాయకుడు ఫీర్ మహ్మద్






