22 July, 2026 | 2:04 AM

జైశ్రీరామ్ ధాన్యానికి రికార్డ్ ధర

22-07-2026 12:00 AM
  1. క్వింటాలుకు రూ.4,013
  2. ఎల్ నినో ప్రభావమే కారణం

కేసముద్రం, జూలై 21 (విజయక్రాంతి): ఎల్ నినో నేపథ్యంలో ధాన్యం ధరలు రోజురో జుకు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జైశ్రీరామ్ సన్న రకం ధాన్యానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఆల్ టైం రికార్డు ధర లభించింది. ఇదే జిల్లాకు చెందిన కోమ టిపల్లి గ్రామ రైతు నునావత్ బాలాజీ గత ఏడా ది పండించిన జైశ్రీరామ్ సన్నరకం దాన్యం 9 బస్తాలను కేసముద్రం మార్కెట్‌కు విక్రయానికి తెచ్చాడు.

ఈ ధాన్యానికి గరిష్ట ధర క్వింటాలుకు రూ.4,013 ధర లభించింది. గతేడాది ఇదే నెల లో ఇదే రకం ధాన్యానికి గరిష్టంగా రూ.3,600 క్వింటాలుకు లభించగా ఈ ఏడాది అదనంగా రూ.400 ధర పెరగడం విశేషం. ఇంత ధర ధాన్యానికి లభించడం మార్కెట్ చరిత్రలో ఇదే ప్రధమమని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఎల్ నినో ప్రభా వం కారణంగా ధాన్యానికి డిమాండ్ ఏర్ప డిందని, ఇందులో పాత రకం ధాన్యానికి మరింత డిమాండ్ ఉందని, అందులో మేలైన సన్న రకం ధాన్యంగా గుర్తింపు పొందిన జైశ్రీరామ్ ధాన్యానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిందని చెప్పారు.