ప్రొటోకాల్ రగడ
26-06-2024 12:03 AM
కొడంగల్, జూన్25 (విజయక్రాంతి) : దౌల్తాబాద్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగతా దౌల్తాబాద్ మండల జడ్పీటీసీ కోట్ల మహిపాల్ అభ్యంతరం తెలిపారు. ఎలాం టి ప్రభుత్వ హోదా లేకున్నా కేవలం ముఖ్యమంత్రి సోదరుడు అనే హోదాతో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో విడుదలైన చెక్కులనే ఇప్పుడు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు.






