7 July, 2026 | 2:22 AM

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ

07-07-2026 12:00 AM

నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ డైరె క్టర్ పోస్టుల భర్తీకు సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొత్తం 10 ఖాళీలున్న ట్లు తెలిపింది. 18 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 10 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు బీటెక్ విద్యార్థులు అర్హులు. మరిన్ని వివరాలకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.