calender_icon.png 1 August, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కాలేజీల్లో కొలువుల భర్తీ

15-05-2025 12:29:48 AM

  1. 1,350 అసిస్టెంట్ పోస్టుల నియామకానికి రంగం సిద్ధం 
  2. అంతకుముందే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు 
  3. వైద్యవిద్య మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో వైద్యవిద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెస ర్లుగా పదోన్నతులు కల్పించడానికి కసరత్తు ప్రారంభం కానుంది.

ఈ పదోన్నతుల ప్రక్రి య పూర్తయిన వెంటనే 1,350 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టనున్నారు. రాష్ర్టంలో మొత్తం 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, అందులో 4,290 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పా టైన గద్వాల, ములుగు, నారాయణపేట, నర్సంపేట, కుత్బుల్లాపూర్, మెదక్, భువనగిరి, మహేశ్వరం మెడికల్ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 50 సీట్ల చొప్పున 400 సీట్లు ఉన్నా యి.

అయితే సరైన ఫ్యాకల్టీ లేకుండానే కాలేజీలను నడుపుతున్నారంటూ నేషనల్ మెడి కల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ప్రభుత్వానికి నోటీసులు పంపింది. త్వరలోనే సర్దుబాటు చేస్తా మంటూ అధికారులు ఎన్‌ఎంసీకి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పేరుకే మెడికల్ కాలేజీలు అంటూ ‘విజయక్రాంతి’ గత నెల 23న ఓ కథనం సైతం ప్రచురించింది.

 త్వరలోనే పదోన్నతులు, ఆ తర్వాత నియామకాల ద్వారా ఫ్యాకల్టీని నియమిస్తామని అధికారులు తెలిపారు. 

జూన్ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి..

ప్రస్తుతం రాష్ర్టంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న 131 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి దక్కనుంది. ఇక 404 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించనుంది. ఆ తర్వాత 1350 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియామకాల ద్వారా భర్తీ చేయనుంది.

అయితే ఇందులో సగం రెగ్యులర్ నియామకాలు, సగం కాంట్రాక్ట్ పద్ధతిన నియమించనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. చాలాకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు. ఇక కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపడుతుండడంతో అనేక మంది వైద్యులు ఎందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.