calender_icon.png 31 July, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివారణ చర్యలు గట్టెక్కించేనా?

15-05-2025 12:24:50 AM

  1. గత ఏడాది వర్షాకాలంలో ముంపుకు గురైన పాలమూరు పట్టణం 
  2. పట్టణంలో వర్షపు నీటి నివారణకు రూ.217 కోట్ల పనులకు శ్రీకారం 
  3. మరో నెల లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం 
  4. లోతట్టు ప్రాంతాల్లో నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 
  5. పెద్ద డ్రైన్లు పూర్తి, ఎస్టీపీల నిర్మాణం కోసం చర్యలు : మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ 

మహబూబ్ నగర్ మే 13 (విజయ క్రాంతి) : వర్షాకాలం వస్తుందంటే చాలు... పాలమూరు పట్టణంలో ముంపు ప్రాంతాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. గతకుండేళ్లుగా ఈ పరిస్థితి యధావిధిగా కొనసా గుతూనే ఉంది. వర్షాకాలంలో ప్రజా ప్రతినిధులు ముంపు ప్రాంతాల లో పర్యటించిన నివారణ చర్యలు చేపడతామని హామీ ఇస్తు న్న ఆశించిన మేరకు పనులు జరగడం లేద ని ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో మరో నెలలో వస్తున్న వర్షాకాలం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురిస్తే పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు కు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణవాసులు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు పట్టణంలో ముంపు కు గురైన ప్రాంతాల్లో పర్యవేక్షణ చేశారు.

ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని లోతట్టు ప్రాం తాల ప్రజలకు భరోసా కల్పించారు. కల్పించిన భరోసా కచ్చితంగా ఉంటుందా..? ఉండదా..? మరిన్ని నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటే శరవేగంగా తీసుకొని ఉన్న సమయాన్ని సద్వినిగం చేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం నీటి దాటికి గురికాకుండా చూడవలసిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. 

ప్రణాళికలు ఫలించేనా..?

పట్టణ ప్రాంతంలో వీరన్నపేట్, గణేష్ నగర్, బాయమ్మ తోట, శ్రీనివాస్ కాలనీ లో కొంత భాగం, బికే రెడ్డి కాలనీ, ఢిల్లీ ఒలంపియాడ్ స్కూల్ పరిసర ప్రాంతలతో పాటు మోతి నగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నుం చి రాకపోకలు ఇలా పలు ప్రాంతాల్లో ప్రజ లు వర్షాలు బాగా కురిస్తే ఇబ్బందులకు గురి అయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తే ఈ ప్రాంతాలతో పాటు మరిన్ని ప్రాంతాలు ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి.

ఇక భవిష్య త్తులో కూడా వీరికి ఇలాంటి డోకా ఉండే అవకాశం లేదని, ముప్పు ప్రాంతానికి గురి కాదని అధికారులు చెబుతున్నారు. ముప్పు కు గురికాకుండా నివారణ చర్యలు అధికారులు పక్కా ప్రాణాలతో తీసుకున్నట్లు పే ర్కొంటున్నారు. పెద్ద చెరువు కింది భాగంలో భారీ ఎత్తున ఆర కిలోమీటర్ పొడవున పెద్ద డ్రైనేజీని నిర్మాణం చేపట్టారు,

ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పెద్ద చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ముందస్తులు చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. ఈ ఏడాది అధికారులు తీసుకుంటున్న చర్యలకు వర్షపు నీటి ద్వార మునిగే ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే అవకాశం ఉంది. 

రూ. 217 కోట్లతో ముంపు నివారణ చర్యలకు శ్రీకారం 

పట్టణంలో గతంలో ఎప్పుడు లేని విధం గా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాన్ని తట్టుకొని యధావిధిగా ఏర్పాటుచేసిన ట్రైన్ల ద్వా రా వర్షపు నీరు పోయేలా మున్సిపల్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకు రూ 217 కోట్లు ప్రణాళికలతో అధికారులు ఖర్చు చేసేందుకు ముందుకు సాగుతున్నారు.

ఈ నిధులలో మూడు ఎస్టీలను నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెద్ద చెరువు పై భాగంలో ఒక ఎస్టిపి, ఢిల్లీ ఒలంపియాడ్ స్కూల్ సమీపం లో, ముత్తూట్ పరిధిలో మరో ఎస్టిపిలను నిర్మించేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. వీటిని నిర్మాణం కోసం అవసరమైన ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు కూడా ప్రక్రియ ఆరంభమైంది.

పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం 

ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు పెద్ద చెరువు కింది భాగం లో పెద్ద ట్రైన్‌ను కూడా పూర్తి చేయ డం జరిగింది. ఎస్‌టిపిల నిర్మాణం కూడా చే సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము.

పట్టణంలో ముప్పు ప్రాంతా లు లేకుండా ఉండేలా పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. వర్షా లు ఏమేరకు వచ్చిన ఎవరికి ఇబ్బంది కాకుండా  అనుకుంటు న్నాం. వర్షాలు కురిసేందుకు మరో నెల సమయం ఉండడంతో తదుపరి పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

                                                                                                                                                                    మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది

గతంలో జరిగిన విషయాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఎక్కడ ఏ ప్రాంతం లో వర్షపు నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల నుంచి నీరు ఎలా ముందుకు వేగంగా పోయేలా ఉంటుందో ఆ చర్య లు తీసుకున్నాం.

వర్షాకాలం ప్రారంభంలో కూడా డ్రైవర్ ఎక్కడికక్కడ పరిశు భ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే పండ్లను వేగవంతంగా చేస్తున్నాం. ప్రజలకు వర్షపు నీరు ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్   కమిషనర్, మహబూబ్‌నగర్