10-05-2025 01:00:32 AM
కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కొత్తపల్లి, మే 9 (విజయ క్రాంతి): ప్రతి రోజు తడి పొడి చెత్తను వేరు చేసి డంపు యార్డుకు చెత్తను తగ్గించాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా విలీనం చెందిన మల్కాపూర్, లక్ష్మీపూర్, కొత్తపల్లిలో శుక్రవారం కమిషనర్ పర్యటించారు.
ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.... ఇంట్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్త... ఇంట్లోనే వేరు చేయబడి...బుట్టల ద్వారా నగరపాలక సంస్థ కార్మీకులకు అందించాలని కోరారు. చెత్తను సేకరించి స్వచ్చ్ ఆటోల ద్వారా కొత్తపల్లి, మల్కాపూర్ డంపు యార్డు వద్ద పొడి చెత్తలోని డబ్బాలు, అట్టముక్కలు ఇతర వస్తువులను డీఆర్ సీసీ కి, తడి చెత్తను స్థానికంగా ఉన్న వర్మికంపోస్టు పిట్స్ ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేయాలని కోరారు.
సెక్రిీగేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి... డంపు యార్డుకు వెల్లే చెత్తను పూర్తి స్థాయిలో తగ్గించాలన్నారు. నగర వ్యాప్తంగా ప్రడి డివిజన్ లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించి...కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
ప్రతి ఇంటి నుండి చెత్తను కార్మీకులు తప్పకుండ సేకరించి... 100 శాతం సెక్రిీగేషన్ చేయాలని ఆదేశించారు. చెత్త సెక్రిీగేషన్ అయితే... డంపు యార్డుకు చెత్త తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.