calender_icon.png 11 May, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు మంత్రులుండి జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏంటి?

10-05-2025 01:01:24 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

కల్లూరు మే9 (విజయ క్రాంతి)కాంగ్రెస్ పార్టీ నమ్మి ఉ మ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు, అధికారంలోకి వచ్చ, ముగ్గురు మంత్రులు ఉండి కాంగ్రెస్ పార్టీ 17 నెలల్లో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రశ్నించారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరులో రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల కోసం సీతారామ ప్రాజెక్టు తెస్తే ఆ నీళ్లను నెత్తిన జల్లుకున్నారు తప్ప ప్రజలకు సాగునీరు అందించలేదని ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎపిటివిటీ, నోట్లు, అబద్ధపు హామీలు ఇచ్చాడని విమ ర్శించారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నీ తీరుస్తామని ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో ఆమలు చేయలేదన్నారు. గర్భి ణీ స్త్రీల కోసం కెసిఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ అనే పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేసారని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వడం లేదు రుణమాఫీ చేయడం లేదు షాదీ ముబారక్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు.

మార్పు బాగుందా మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్కు పట్టం కట్టారు, మంచి నాయకులను ఓడ కొట్టారని  కేటీఆర్ అన్నా రు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ రాయల శేషగిరిరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై అప్పటి తెరాసలో చేరారు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2014లో డిసిసిబి డైరెక్టర్గా పని చేశారని, 2019లో డీసీఎంఎస్ చైర్మన్గా సేవలు అం దించారని, అనారోగ్య కారణంగా 2024 మే 15న హైదరాబాదులో నీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బిఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు.

అనంతరం కేటీఆర్ రాయల శేషగిరిరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబ స భ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మ ధు, ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజ య్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు  కందాల ఉపేందర్ రెడ్డి, వన మా వెంకటేశ్వర రావు, రేగా కాంతారావు, బానోత్ హరిప్రియ, కొండ బాల కోటేశ్వరరావు, మదన్ లాల్, మెచ్చ నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు.