calender_icon.png 11 May, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాంతీయ ఆసుపత్రి మీద రెడ్ క్రాస్..

10-05-2025 12:57:06 AM

సిరిసిల్ల, మే 9 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల మీద పన్నెండు అడుగుల పొడవు, వెడల్పుల తెలుపు రంగు మీద నాలుగు అడుగుల ఎరుపు రంగులో రెడ్ క్రాస్ వేయడం జరుగుతుంది.

ఇందులో భాగంగా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి భవనం మీద వేయడం జరిగిందని, యుద్ధ సమతయంలో అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద దాడులు చేయకూడదనే జెనీవాలో కుదుర్చుకున్న అంతర్జాతీయ యుద్ధ నియమాల్లో భాగంగా ఈ విధమైన గుర్తు వేయడం జరిగిందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు.