02-07-2024 05:07:03 AM
న్యూఢిల్లీ: వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు ఊరటనిస్తూ చమురు మార్కెట్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోల సిలిండర్ ధర గరిష్ఠంగా రూ.32 వరకు తగ్గింది. ఢిల్లీలో ప్రస్తుత ధర రూ.1,646కు దిగొచ్చింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.కొన్ని నెలలగా వాణిజ్య సిలిండర్ ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1న 19 కిలోల సిలిండర్ ధరను రూ.69.50 తగ్గించారు. అంతకుముందు మే 1న కూడా ధరను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధిక నిర్వహణ వ్యయాలతో సతమతమవుతున్న హోటళ్లు, రెస్టారంట్లు సహా ఇతర వ్యాపారులకు దీంతో ఊరట లభిస్తోంది.