అవిశ్వాస తీర్మానంపై స్టేకు నిరాకరణ
ఎల్లారెడ్డి మున్సిపల్ వివాదంలో హైకోర్టు తీర్పు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరా కరించింది. అవిశ్వాస తీర్మానం వ్యవహారంపై సమావేశం నిర్వహించవచ్చ ని స్పష్టం చేసింది. అయితే, ఫలితాలను ప్రకటించరాదని షరతు విధిం చింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గాను ఏప్రిల్ 27న కలెక్టర్ ఇచ్చిన నోటీసును ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారా యణ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారించారు.
అవిశ్వాస తీర్మా నం అమలు తర్వాత ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని, అందువల్ల తీర్మానంపై సమావేశం నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిష నర్ న్యాయవాది కోరారు. ప్రభుత్వ న్యాయవాది బీ మోహనరెడ్డి వాదన లు వినిపిస్తూ.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేతులు ఎత్తే విధానంలో జరుగుతుందన్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.




