9 July, 2026 | 1:00 AM

ఆర్డీఎస్‌పై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలకు

09-07-2026 12:00 AM

సంపత్ కుమార్ కౌంటర్

అలంపూర్, జూలై 8: ఆర్డీఎస్ అంశంపై బీఆర్‌ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. సంపత్ కుమార్ బుధవారం విమర్శించారు. రాజోలి బండ వద్ద బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ఆర్డీఎస్ సమస్యపై బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్లమల్లమ్మకుంట రిజర్వాయర్, భూసేకరణ తదితర పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించిన సంపత్ కుమార్, అలంపూర్ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.