02-11-2025 12:29:16 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి కాంటా చౌరస్తా వరకు 100 ఫీట్ల విస్తరణలో రోడ్డుకు రెండు వైపులా దుకాణాలు, షెడ్లు కోల్పోయిన చిరు వ్యాపారులకు పునరావాసం కల్పిస్తామని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణలో షాపులు, కోళ్ల అమ్మకం వ్యాపారులు, , పండ్లు తోపుడు బండ్ల అమ్మకం దారులు, పాన్ టేలా ల వ్యాపారులను గుర్తించి పాత సిఎస్పి వద్దగల రెండు ఎకరాల స్థలంలో పునరావసం కల్పిస్తామన్నారు. అక్కడే షాపులు నడుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేపడతామన్నారు. వ్యాపారులు ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు.