02-11-2025 12:33:53 PM
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు జరిగిన ఎన్నికలలో కర్ర రాజశేఖర్ ప్యానల్ మెజారిటీ డైరెక్టర్ స్థానాలను దక్కించుకుంది. పోలింగ్ శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగగా ఓట్ల లెక్కింపు ఆదివారం వరకు కొనసాగింది. మూడు ప్యానల్ అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాగా మాజీ ఛైర్మన్ కర్ర రాజశేఖర్ ప్యానల్ నుండి 9 మంది గెలుపొందారు.. కర్ర రాజశేఖర్ ప్యానల్ కు పార్టీ లకు అతీతంగా మద్దతు లభించడంతో ఆయన ప్యానల్ గెలుపు సులువైనది. గడ్డం విలాస్ రెడ్డి ప్యానల్ నుండి ఒక్కరూబుకూడా గెలుపొందలేదు. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావుప్యానల్ నుండి ఇద్దరువమాత్రమే గే లుపొందరు.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు 12 డైరెక్టర్ స్థానాలకు 56 మంది పోటీ పదగా 43 మంది 9 జనరల్ స్థానాలకు, ఐదుగురు రెండు మహిళా స్థానాలకు, ఒక ఎస్సీ, ఎస్టీ స్థానానికి 8 మంది పోటీ పడ్డారు. కర్ర రాజశేఖర్ ప్యానల్లో డైరెక్టర్లుగా టి.వీరారెడ్డి, బాశెట్టి కిషన్ దేశ వేదం, బండ ప్రశాంత్ దీపక్, బొమ్మరాతి సాయికృష్ణ, సరిల్ల రతన్ రాజు, ముద్దసాని శ్వేత, వరాల జ్యోతిలు విజయసాదించారు. వెలిచాల రాజేందర్రావు నిర్మల భరోసా ప్యానల్ అనురాసు కుమార్, ఉయ్యాల ఆనందంలు విజయం సాదించారు. వీరితో పాటు ప్యానల్ కు సంబందంబ్లేకుండా కన్న సాయి గెలిచారు. సోమవారం సమావేశం నిర్వహించి చైర్ణన్ ను ఎన్నుకుంటారు. రాజశేఖర్ చైర్మన్ ఎన్నిక లాంఛనం కానుంది.