చోరీకి గురైన 126 సెల్‌ఫోన్లు రికవరీ
- యజమానులకు అందజేసిన రైల్వే పోలీసులు
- మూడేళ్ల కాలంగా రూ.2 కోట్ల విలువ చేసే 1500 మొబైల్ ఫోన్లు స్వాధీనం
సికింద్రాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): రైల్వే ప్రయాణాల్లో పోయిన, దొం గిలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి యజమానులకు అందజేయడంలో తెలంగాణ రైల్వే పోలీసులు విశేష ఫలితాలు సాధించారు. సెంట్రల్ ఎక్వి ప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ప్రయాణీకులు పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 126 మొబైళ్లను ట్రేస్ చేసి తిరిగి బాధితులకు అందజేశారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ జీఆర్పీపోలీసు స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే డీఎస్సీ జావేద్,ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్తో కలిసి మీడియా కువివరాలు వెల్లడించారు. రైల్వే పోలీసులు ఆద్వర్యంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు అయిన ఫిర్యాదు లను పరిశీలించి వివిధ మార్గాల ద్వారా వాటిని ట్రేస్ చేసినట్లు చెప్పారు .
2023 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 1500 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.కాగా మంగళవారం సుమారు రూ.20 లక్షల విలువైన 126 మొబైళ్లను బాధితులకు అందజేశామని చెప్పారు. ఈ మొబైళ్లను రైల్వే ప్రత్యేక బృంధాలు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ప్రయాణికులు ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోయిన ట్లయితే వెంటనే ఐఎంఈ ఐ నంబరు ద్వారా సీఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేయాలని ఆయన సూచించారు. సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే ఫోన్ను ట్రాక్ చేసి తిరిగి అందజేస్తామని తెలిపారు.






