28 June, 2026 | 5:58 AM

మరో రెండు రోజులు వర్షాలు

14-06-2024 12:19 AM

వాతావర కేంద్రం డైరెక్టర్ నాగరత్నం 

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో రెండు  వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావర కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నెల 18 నుంచి మూడు రోజులుపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జూన్ నెల లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని చెప్పారు.