22-06-2025 08:36:24 PM
డాన్ టు డస్క్ కార్యక్రమంలో సహాయం..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలంలోని వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత గుడిలో గరుకు స్థంభం, 1000 లీటర్ల వాటర్ ట్యాంకు, బహుమానంగా ఇచ్చి, ఇదే సందర్భంగా ఒక వికలాంగునికి నిత్యవసర వస్తువులు, ఇద్దరు రైతులకు సన్మానం, వారికి అవసరమైన విత్తనాలు, చెప్పులు కుట్టే వారికి ఇద్దరికీ గొడుగులు ఇచ్చారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా, పాత అధ్యక్షులు అందరికీ సన్మానం జరిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ అంచూరి శ్రీనివాస్ ,గవర్నర్ విఎన్ గోల్డెన్ స్టార్ గట్టు రాణి, కే సి జి ఎఫ్ ఎనిమల మనోజ్ కుమార్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మానుక రాజేంద్రప్రసాద్, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రావి కంటి పవన్ కుమార్ ,డిస్టిక్ క్యాబినెట్ ఆఫీసర్ ,డిప్యూటీ గవర్నర్ కే సి జి ఎఫ్ మహాజన్ జితేందర్, రీజన్ చైర్మన్ కొత్త సునీల్, జోన్ చైర్మన్ గోలి పద్మజా, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చిటికేసి రవీందర్ ,సెక్రటరీ చిటికేసి సతీష్ కుమార్, కోశాధికారి కూరగాయల సతీష్ కుమార్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎర్ర సుధాకర్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కటకం స్వరూపారాణి ,సెక్రటరీ నీలి శ్రీలత, కోశాధికారి మారా రమ, తదితరులు పాల్గొన్నారు.