calender_icon.png 23 June, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సాబీర్

22-06-2025 08:32:34 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం(Telangana Government Drivers Association) వరంగల్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా రిటర్నింగ్ అధికారి ఎండి జహంగీర్ అలీ, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. భాస్కర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

జిల్లా అధ్యక్ష పదవికి ఎండి. సాబీర్ తో పాటు ఏ. ప్రకాష్ పోటీపడ్డారు. పోటీలో ఉన్న ప్రకాష్ విత్ డ్రా చేసుకోగా ఎండి. సాబీర్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సాబీర్ ను డ్రైవర్ల సంఘం ప్రతినిధులు లక్ష్మి కాంతారావు, యు. కృష్ణమూర్తి, ఎండి. అఫ్జల్ మియా, పి. విశ్వతేజ, కె. శ్రీనివాస్, ఎం. మధు, ఎండి. ఇబ్రహీం తదితరులు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు.