08-12-2025 01:18:10 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 7 (విజయ క్రాంతి):ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టాణ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ మాట్లాడుతూ . ఎల్లారెడ్డిపేట మండలం లోని పోతిరెడ్డి పల్లె గ్రామ ప్రభుత్వ స్థలం నుండి దొంగ తనంగా ఒక టిప్పర్ లో మొరం నింపుకొని అక్రమంగా తరలిస్తూన్నా వ్యక్తులు పోతిరెడ్డి పల్లె నుండి సిరసిల్ల కి వస్తుండగా పెద్దూరు బస్ స్టాండు వద్ద పోలీసువారు అట్టి టిప్పర్ ను ఆపి రవాణా చేయుటకు సంబందిత పత్రాలను అడుగా వారు ఎటువంటి పత్రాలను చుపించానందున వారిని పట్టుకొని విచారించగా నిందితులు గత కొంత కాలంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి,
మొరం ను ఎల్లారెడ్డిపేట మండలం లోని పోతిరెడ్డి పల్లె గ్రామ ప్రభుత్వ స్థలం నుండి తెస్తూ సిరిసిల్ల లో అవసరం ఉన్న వారికి దొంగతనంగా అమ్ముతూ లాభాలు పొందుతున్నామని తెలుపగా వారిని మొరం టిప్పర్ తో యుక్తంగా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేసుకొని రిమాండుకి పంపనైనదని తెలిపినారు.ఎవరైనా మట్టిని గాని మొరం ను గాని మరియు ఇసుకను గాని ఎలాంటి పర్మిషన్ లేకుండా దొంగ తనగా అక్రమముగా రవాణా చేస్తే వారిపై చట్టపరంగా కటిన చర్యలు తిసుకొన బడతాయి అని తెలిపినారు.