24 August, 2026 | 11:48 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

అక్రమ కట్టడాల తొలగింపు

19-06-2025 11:09 AM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాల సమీపంలోని వీఐపీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైయిన్‌ ను అక్రమంగా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను  కాగజ్‌నగర్ మున్సిపల్ కమీషనర్ అంజయ్య(Kagaznagar Municipal Commissioner Anjaiah) ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజాము నుండి జేసీబీతో తొలగించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాగజ్‌నగర్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్ కుమార్, రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి యశ్వంత్,  టీపీబీఓలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.