calender_icon.png 19 July, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారం రోజుల్లో కట్టడాలను తొలగించి స్వాధీనం చేసుకోండి

19-07-2025 12:59:46 AM

-  మాస్టర్ ప్లాన్ వాస్తు ప్రకారం ఆర్కిటెక్టివ్ చర్చించి రూపొందించండి

- రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

భద్రాచలం, జులై 18 (విజయ క్రాంతి)భద్రాచలం ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా కట్టుబడి ఉందని, చుట్టూ ఉన్న నిర్మాణాలు తొలగించిన వెంటనే నిధులు కే టాయించి భద్రాద్రి రామాలయంలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం భద్రాచలం పర్యటన కూర్చున్న సందర్భంగా భద్రాద్రి రామాలయం చుట్టూ మాడవీధుల విస్తరణకు ప్ర భుత్వం తీసుకున్న భవనాలను తొలగించే ప్ర క్రియ పరిశీలించారు. ప్రభుత్వం నుండి అన్ని బకాయిలు ఇంటి యజమానులకు చెల్లించినందున వెంటనే తొలగించి కార్యక్రమం వారం రోజుల్లో పూర్తిచేయాలని రెవె న్యూ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. దేవాలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించిన వెంటనే ఫెన్సింగ్ వేసి జండాలు పెట్టాలని ఆదేశించారు.

అంతేకాకుండా దేవస్థానం ఆర్కిటెక్ట్తో మాట్లాడి వెంటనే దేవాల యం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తయారు చే యాలని కూడా అధికారం ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి రామాలయం చుట్టూ తిరిగి అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలో రెవె న్యూ దేవస్థానం ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు. మంత్రి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటి డిఏ పిఓ రాహుల్, భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు పినపాక శాసనస భ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, ఈ ఈ రవీంద్రనాథ్ తో పా టు పలువురు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం, జులై 18 (విజయ క్రాంతి) మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ ని ర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అధ్యక్షతన నిర్వ హించిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పాల్గొన్నా రు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూతెలంగాణ రా ష్ట్రంలో మహిళల సాధికారత కోసం ప్రభు త్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, మ హిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా భద్రత పథకాలు, ఉచిత బస్సు ప్ర యాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనమని ఆయన వివరించారు.

గత పాలనలో చెల్లించని రూ 3 ,750 కోట్ల పావల వడ్డీ బకాయిలు చెల్లించలేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎర్ప డిన తర్వాత రూ865 కోట్లు మహిళా సం ఘాల ఖాతాల్లో జమ చేశామని మంత్రి చె ప్పారు. అంతేకాక, మహిళా సభ్యుల బీమా పథకాన్ని పునరుద్ధరించి, సహజ మరణానికి రూ 2 లక్షలు, ప్రమాద మరణానికి రూ 10 లక్షల బీమా కల్పించినట్లు వివరించారు.పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రధాన లక్ష్యంగా తీసుకున్న ప్రభుత్వం, తొలి దశలో భద్రాచలం నియోజకవర్గానికి 4,500 ఇళ్లను మంజూరు చేసింది. అలాగే, భద్రాచలం ని యోజకవర్గానికి అదనంగా 1,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలకు రేష న్ కార్డులే ఇవ్వలేకపోయిందని, నేటి ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుతో పాటు, ఆరోగ్యానికి హానికరమైన దొడ్డు బి య్యం స్థానంలో పోషక విలువలతో కూడిన సన్నబియ్యాన్ని అందించుతోందని మంత్రి అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో తాటాకు ఇళ్ల ను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రతి గూడెంకు విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదల కష్టాలను తీర్చే దిశగా ప్రభు త్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెం కట్రావు మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా భద్రాచలo ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందన్నారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని 390 మహిళ సమాఖ్య సంఘాల ద్వారా సుమారు 40000 మంది మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ,జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డి ఎస్‌ఓ రుక్మిణి, భద్రాచలం తాసిల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.