19-07-2025 01:01:56 AM
- భద్రాచలం గిరిజన మహిళలు ప్రపంచ వ్యాప్తంగా పేరు సాధించి ప్రధాని మోడీ ప్రశంసలు సైతం పొందటం గొప్ప విషయం
- రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, జులై 18 (విజయ క్రాంతి)ఆదివాసి గిరిజన మహిళలు ఇంటిపట్టునే ఖా ళీగా ఉండకుండా స్వసక్తితో జీవనాధారం పెంపొందించుకోవడానికి చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకొని ఇంటికి అవసరమైన వస్తువులు తయారు చేసి వాటిని అమ్మకాలు జరుపుకోవడమే కాక ఐటీడీఏ ఎం ఎస్ ఎం ఈ గ్రూప్ మహిళలు తయారు చేసిన మి ల్లెట్ బిస్కెట్ల ఘనత లండన్ వరకు చేరుకొని ప్రధాని నోట మన భద్రాచలం పేరు రావ డం ఎంతో గొప్ప విషయం అని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, మాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవ నంలో నిర్వహించిన ఇందిరమ్మ రేల మహి ళా శక్తి సంబరాలు కార్యక్రమం సందర్భంగా వివిధ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి మహిళలు వారే సొంతంగా తయారు చేసిన ఆరు రకాల సబ్బులు షాంపూలు, మి ల్లెట్ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్లు, ఇతర రకాల పచ్చళ్ళు, న్యూట్రి మిక్స్, న్యూట్రి డ్రైమిక్స్, రాగి జావా, జొన్న జావా తయారుచేసి ప్రజలకు సరసమైన ధరలకు అమ్మకాలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చి గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం చాలా సం తోషకరమని ఆయన అన్నారు.
వారు త యారు చేసిన వస్తువులు ప్రతి ఒక్కరు కొనుగోలు చేసి వారి జీవన భృతికి తోడ్పాటు అందించాలని అన్నారు. వారు తయారు చే సే సబ్బులు షాంపూలు వివిధ రకాల ఔషధ గుణాలు కలిగిన వనమూలికలు కలిపి శరీరానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా అన్ని పదార్థాలు సమపాలల్లో కలిపి తయారు చే స్తారని అటువంటి ఔషధ గుణాలు కలిగిన వస్తువులు ఇంటిల్లిపాది వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు.
భద్రాద్రి శ్రీరామ జాయింట్ లీయబిలిటీ మ హిళా గ్రూపు సభ్యులు, శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లియాబిలిటీ మహిళాగ్రూప్ స భ్యులు, ఓం శక్తి మహిళా ప్రొడకట్స్, భద్రాద్రి మిల్లెట్, లక్ష్మీ గణపతి, దమ్మక్క జాయింట్ లియాబిలిటీ గ్రూప్ సభ్యులు రాగి, సజ్జలు, కొర్రలు మరియు ఇతర న్యూట్రిషన్ పదార్థాలతో తయారు చేసే మిల్లెట్ బిస్కెట్లు, ఇప్ప పువ్వు లడ్డూలు, మునగ, కరివేపాకు కారంపొడి, మామిడికాయ, గోంగూర పచ్చళ్ళు అమ్మకాలు జరుపు కుంటున్నారని, వీరు అ మ్మకాలు జరుపుకోవడానికి దేవస్థానం ప్రాంగణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయం అవకాశం ఇవ్వడమే కాక వీరికి మార్కెట్ సౌకర్యం కల్పించడానికి కృషిచేసిన ఐటీడీఏ పీవో కు అభినందిస్తున్న ట్లు ఆయన అన్నారు.
అనంతరం వారు త యారు చేసిన సబ్బులు షాంపూలు ఇతర వస్తువులు, మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపు లడ్లు మ హిళలు మంత్రివర్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ మహిళలు వెంకటలక్ష్మి, సమ్మక్క, లలిత, సున్నం ఈశ్వరి, సు న్నం స్వాతి,వసుంధర, జగ్గా కుమారి, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.