6 July, 2026 | 3:46 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •  

హైవేలపై ఆక్రమణలు తొలగించండి

28-08-2024 02:50 AM

సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 27: జాతీయ రహదారుల ఆక్రమణలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నేషనల్ హైవేల్లో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టంచేసింది. ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందు కు ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొ ందించాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జితో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. ఇందులో ఫొటోలు అప్‌లోడ్ చేసే అవకాశ మూ కల్పించాలని పేర్కొంది. టోల్ ఫ్రీ నంబర్ సైతం ఏర్పాటు చేయాలని తెలిపింది. సెప్టెంబర్ 30లోపు ఈ ఆదేశాలను పాటించాలని కేంద్రానికి నిర్దేశించింది. జాతీయ రహదారుల్లో ఆక్రమణలపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. హైవేలపై ఆక్రమణలు తొలగించండి.