24-09-2025 12:06:51 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డుకు జరు గుతున్న మరమత్తు పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరదల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను త్వరగా మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి ప్రజల రాక పోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రజా రవాణాకి ఇబ్బంది కలగకుండా సకాలములో రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ దుర్గాప్రసాడ్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ హిమబిందు, మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాస్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ స్వామి దాస్, ఏఈఈ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.