calender_icon.png 24 September, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆది కర్మయోగి పథకం

24-09-2025 12:06:11 AM

భద్రాచలం , సెప్టెంబర్ 23,(విజయక్రాంతి):మారుమూల ఆదివాసి గిరిజన గ్రా మాలలోని గిరిజనులు, గిరిజన యువత, రై తుల అభివృద్ధి, గ్రామాల మౌలిక వసతుల కల్పన, గ్రామంలోని సమస్యలు పరిష్కరించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి అభియాన్ పథకం దోహదపడుతుందని ఐ టిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నా రు. మంగళవారం దుమ్ముగూడెం మండ లం సింగవరం, నడికుడి గ్రామాలలో ఆది క ర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగం గా ఆది సేవ కేంద్రం ప్రారంభించి అధికారు లు , గ్రామస్తులతో కలిసి గ్రామములోని స మస్యలు, కావలసిన మౌలిక వసతుల కల్పన గురించి తెలుసుకొన్నారు.

గ్రామంలో ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమా నికి ప్రారంభానికి వచ్చిన ఐటీడీఏ పీవో , మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అ ఫైర్స్ న్యూఢిల్లీ నుండి వచ్చిన అబ్జర్వర్ ప్రదీ ప్ కుమార్ ను, అధికారులను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు చి న్నారులు బతుకమ్మ ఆటలతో యువకులు వాలీబాల్ క్రీడలతో అలరించి కార్యక్రమాన్ని పండుగ వాతావరణం లో నిర్వహించిన అ నంతరం పిఓ మాట్లాడుతూ 2030 సంవత్సరానికి ఆది కర్మయోగి అభియాన్ పథకం లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయన్నారు. అందుకు ప్రతి గ్రామంలో వాలంటీర్ , సాతి సహాయోగులను నియమించడం జరిగిందని, నియమించబడ్డ సహాయోగులు ప్రతి శనివారం మీ గ్రామాలలో ఉన్న సమస్యలను చర్చించు కొని ప్రతిపాదనలు తయా రు చేయాలని చివరి శనివారం అధికారుల సమక్షంలో అధికారుల సమక్షంలో ప్రతిపాదనలో తయారుచేసి ఇవ్వాలని అన్నారు.

అలాగే ఐటిఐ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నడపబడుతున్న పాఠశాలల్లో జిపిఎస్ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పునాది నుండి విద్యాభ్యాసం బలపడడానికి ఉద్దీపకం అనే వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ వ ర్క్ బుక్ ప్రవేశపెట్టడం వలన చాలావరకు గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి పెరిగిందని, ప్రైమరీ స్కూల్ చదువుతున్న విద్యా ర్థులకు 10వ తరగతి పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో వారు ఏ రంగాన్ని ఎంచుకుంటారో అని తెలియజేయడానికి కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టామని ప్రతిరోజు వా రికి చదువుతోపాటు కెరియర్ గార్డెన్స్ కు సంబంధించిన అంశాలు అర్ధమయ్యే విధం గా ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, వారానికి రెండు రోజులు వివిధ అధికారుల సమ క్షంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులకు ఐటీడీఏ ద్వారా వివిధ రకాల శిక్షణలు అం దించడం జరుగుతుందని, సబ్సిడీ ద్వారా రుణాలు అందించి జీవనోపాధిక పెంపొందించడానికి కృషి చేస్తున్నామని, ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద 2028 నాటికి అన్ని గిరిజన గ్రామాలలోని కుటుంబాలకు తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు వ చ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. 

 అ నంతరం సింగవరం మరియు నడికుడి గ్రా మాలలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులు వివరించారు. గ్రామాలలో ఎక్కువ శాతం సీసీ రోడ్ల నిర్మాణం, మొత్తం త్రీఫేస్ కరెంట్ లైన్, మంచినీటి సమస్య, గ్రామంలోని ఇలవేల్పుల గద్దెల నిర్మాణం ధర్మారం మరియు అభివృద్ధి,చెరువులకు కాలువల నిర్మాణం, వ్యవసాయానికి నీటి వసతి, విద్యార్థులకు బస్సు సౌకర్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, గిరిజన కుటుంబాలకు గుర్తింపు కార్డులు, వృద్ధాప్యపు వితంతు పెన్షన్లు, వి ద్యార్థులు పై చదువులు చదువుకోడానికి ఆ ర్థిక సహాయము, పాఠశాలల నిర్మాణం, నేషనల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులకు క్రీడా పరికరాలు కమ్యూనిటీ హాల్ సౌకర్యం, గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటు, సా గు భూమికి ఆర్వైఎఫ్‌ఆర్ పట్టాలు సవర జన విద్యుత్ సౌకర్యం ద్వారా కరెంటు, మోటార్లు నీటి వసతి కల్పించడం, భూ సమస్యలు, మూడున్నరకునే వారికి అటవీ అధికారుల వేధింపులు మానుకునే విధంగా చూడాలని మరియు ఇతర గ్రామాల అభివృద్ధికి సం బంధించిన సమస్యలు తెలియజేశారు.

అనంతరం ఆది కర్మ యోగి అభియాన్ అబ్జర్వర్ ప్రదీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఈ పథ కం కింద అన్ని శాఖల అధికారులు కాలినడకన గ్రామాలలో తిరిగి గ్రామంలోని సమస్య లు తెలుసుకొని 2030 నాటికి ప్రతి జిపి అ భివృద్ధి చెందే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఢిల్లీకి పంపించి నిధులు తెప్పించడం జ రుగుతుందని అన్నారు. అనంతరం లో ఆది కర్మయోగి అభియాన్ న్ కార్యక్రమములో పాల్గొన్న అధికారులు గ్రామస్తులు తెలియజేసిన సమస్యల గురించి వివరణ ఇచ్చి సా ధ్యమైన వాటిని వెంటనే పరిష్కరిస్తామని మి గతా సమస్యలను ప్రతిపాదనలు తయారుచేసి పై అధికారులకు పంపిస్తామని తెలిపా రు.అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వాలీబాల్ ఆడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు.ఆది కర్మయోగి అభియా న్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పిఓకు మరియు అధికారులకు గ్రామ స్తులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దార్ మరియు స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్, ఎంపీ ఓ రా మకృష్ణ, డిఎంటిలు రాంబాబు, మధువన్, జగదీష్, డిఎంహెచ్‌ఓ సైదులు, డిప్యూటీ డిఎంహెచ్వో చైతన్య, సిడిపిఓ జ్యోతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.