16 May, 2026 | 8:16 PM

మహిళా సంఘాల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయండి

16-05-2026 07:43 PM

బోథ్,(విజయక్రాంతి): మహిళా సంఘాల ఆర్థిక ఎదుగుదలకు టీఆర్సీలు కృషి చేయాలని డిపిఎం అఖిల స్వామిలు ఎస్ వి పి ఏపీఎం పి గణేష్ లు కోరారు. శనివారం వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఆర్సీల సమావేశంలో వారు మాట్లాడుతూ... నూతనంగా చేపట్టే వ్యాపారాలను ప్రోత్సహించాలని అందుకు అవసరమైన అభిమానులను ఇప్పించి రికవరీ చేయాలని కోరారు. ఉద్యమ టార్గెట్లో భాగంగా మహిళా సంఘాలను ఈ దిశగా ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సి ఉంటుందన్నారు అంతేగాక ఉద్యమ రిజిస్ట్రేషన్ పైన దృష్టి సారించాలని దీంతో ఆదాయం వస్తుందని పేర్కొన్నారు సమావేశంలో శంకర్ శశిరేఖ మూడు మండలాల సీసీలు పాల్గొన్నారు