సాహిత్యానికి ద్విగుణీకృత శోభ ద్విరుక్తి
తెలుగు భాష పదాల కూర్పులో ద్విరుక్తులది విలక్షణమైన పాత్ర. ఒకే పదా న్ని రెండుసార్లు ఉచ్ఛరించడాన్ని, లేదా రాయడాన్ని తెలుగు వ్యాకరణంలో ‘ద్విరుక్తి’ అని అంటారు. ఇవి కేవలం అక్షరాల కలయికలు మాత్రమే కావు. మన కళ్లముందు జరుగుతున్న దృశ్యాలను శబ్ద రూపంలో ప్రతిబింబించే అద్భుత చిత్రాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి మహాకవులు వీటిని ప్రయోగించి తెలుగు సాహి త్యానికి సరికొత్త లయను అందించారు.
ఈ పదాలు వాక్యాలకు ఒక రకమైన నాద సౌందర్యాన్ని చేకూరుస్తాయి. భావా న్ని పాఠకుడి హృదయానికి హత్తుకునేలా చే యడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంగ్లిష్ భాషాశాస్త్రంలో వీటిని ‘రెడ్యూప్లికేటివ్స్’ అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా ధ్వని అనుకరణ పదాలుగా ప్రాచుర్యం పొందా యి. కొన్నిసార్లు ఒక పదాన్ని విడదీస్తే అ ర్థం ఉండదు. కానీ, కలిపి వాడినప్పుడు అది ఒక విలక్షణమైన అర్థానిస్తాయి.
మని షి భావోద్వేగాలను వర్ణించేందుకు ద్విరుక్తులు ఎంతో ఉపయోగపడతాయి. తెలుగు సంభాషణల్లో ఇవి నిరంత రం ప్రవహించే ఒక అంతర్వాహిని. సాహిత్యంలో ద్విరుక్తు ల వాడుక కేవలం పదాలు గా కాకుండా వర్ణనాత్మక సాధనాలుగా మారాయి. ఒక సన్నివేశం తీవ్రతను పెంచడానికి కవులు వీటిని ఎంతో నేర్పుగా వాడారు.
ఉదాహరణకు నీరు మరుగుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ‘సల సల’ అనడం వల్ల ఆ వేడి మనకు స్పృశించినట్లు అనిపిస్తుంది. గం టల శబ్దాన్ని ‘గణ గణ’ అని చెప్పినప్పుడు మనసులో ఒక భక్తి భావం జాగతమవుతుంది. ఆకలితో మనిషి పడే ఇబ్బందిని ‘మల మల’ అనే పదం కళ్లకు కడుతుంది. ఇలా ప్రతి భావోద్వేగాన్ని ద్విరుక్తి ఒక దృ శ్యంలా మన కళ్లకు కడుతుంది.
కవుల ప్రయోగాలు
భావకవిత్వ యుగంలో దేవులపల్లి కష్ణశాస్త్రి ద్విరుక్తుల వినియోగించడంలో సిద్ధహస్తుడు. ఆయన తన కవితల్లో ‘రెపరెప’, ‘మిలమిల’ వంటి పదాలను ఎంతో మధురంగా వాడారు. ప్రకృతి వర్ణనల్లో వీటి పా త్ర అమోఘం. గాలికి జెండా ఊగడాన్ని ‘రె ప రెపలాడటం’ అని వర్ణించడం వల్ల ఆ దృ శ్యం సజీవంగా కనిపిస్తుంది. అలాగే నవ్వు ల్లో రకాలను ‘కిల కిల’, ‘పక పక’ అని విడదీయడం ద్వారా భావ వ్యక్తీకరణలో స్ప ష్టత వస్తుంది.
మహాకవి శ్రీశ్రీ కూడా తన విప్లవ కవిత్వంలో ‘దడ దడ’, ‘భగ భగ’ వంటి పదాలను ఉపయోగించి కవిత్వానికి పదును పెట్టారు. ద్విరుక్తులు పాఠకుడిలో ఉద్వేగాన్ని నింపుతాయి. వీటి వినియోగం ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో కనిపిస్తాయి. పొ రుగు రాష్ట్రమైన తమిళనాడులో వీటిని ‘ఇరట్టై కిళవి’ అంటారు. అక్కడ కూడా చల చల, మడ మడ వంటి ప్రయోగాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ద్రావిడ భాషల కుటుం బానికి చెందిన మలయాళం, కన్నడ భాషల్లోనూ ఇలాంటి పోలికలే కనిపిస్తాయి. ఆ శ్చర్యకరంగా జపనీస్ భాషలో ద్విరుక్తుల వాడకం చాలా ఎక్కువ. మన ‘తళ తళ’ అ నే పదానికి సమానంగా వారు ‘పిక -పిక’ అ ని వాడతారు. గుండె చప్పుడును మనం ‘దడ దడ’ అంటే వారు ‘డోకి -డోకి’ అని అంటారు. ఇది భాషల మధ్య ఉన్న సహజ సిద్ధమైన ధ్వని అనుకరణను సూచిస్తుంది.
ప్రయోజనాలు
రచనలకు ద్విరుక్తులు ఒక విలక్షణమైన శోభను చేకూరుస్తాయి. అవి తక్కువ పదాలతో ఎక్కువ గాఢత కలిగిన భావాన్ని వ్య క్తం చేస్తాయి. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా సులభమైన భాషలో భావాన్ని చేరవేస్తాయి. పదాల పునరుక్తి వల్ల కలిగే లయ పాఠకుడికి చదువుతున్నప్పుడు ఒక రకమైన సంగీతపు అను భూ తిని ఇస్తుంది.
వర్ణనలు చదువుతున్నప్పుడు ఆయా దృశ్యాలు నిజంగానే జరుగు తున్న ట్లు భ్రమ కలిగిస్తాయి. ఇవి భాషకు ఒక రకమైన నిండుదనాన్ని, సహజత్వాన్ని ఇస్తా యి. నేటి ఆధునిక సాహిత్యంలో కూ డా ద్విరుక్తులు తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాయి. తెలుగు సాహిత్య సం ప దలో ఇవి వెలకట్టలేని రత్నాలుగా భాసిల్లుతున్నాయి.
సినిమా పాటలు
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల ?
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల ?
(చిత్రం : పోకిరి)
***
మిల మిల మిలా మిలా
మెరుపులు చల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది
నీ అందం !
కిల కిల కిలా కిలా
పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని
ముద్దాడింది ఆనందం !
(చిత్రం: కేరింత)
రతన్ రుద్ర






