దేవాలయాభివృద్ధిలో ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం
మాజీ మంత్రి తలసాని
సనత్‌నగర్ నవంబర్ 9 (విజయక్రాంతి):- సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్క్ లో ఆర్యవైశ్య గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోర మ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఒక వైపు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూనే మరో వైపు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారని వివరించారు.
అదేవిధంగా దేవాల యాల నిర్మాణం, నిర్వహణలోను ఆర్యవైశ్యుల భాగస్వామ్యం ఉంటుందో ఆ దేవా లయాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధి లోని బల్కంపేట ఎల్లమ్మ, కనకదుర్గమ్మ, మహంకాళి అమ్మవారు, గణేష్ ఆలయం వంటి ప్రముఖ దేవాలయాలలో తాను ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి కమిటీలలో ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సం ఘం నాయకులు బాబురావు, రమణయ్య, రాఘవేంద్రరావు, దీపక్, రమేష్, ప్రకాశం, సంపత్, సతీష్ తదితరులు ఉన్నారు.




