22 May, 2026 | 7:37 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

తుర్రవారిగూడెం గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి

22-05-2026 06:41 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల పరిధిలోని తుర్రవారిగూడెం గ్రామపంచాయతీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు, నాయకులు శుక్రవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజ జాను, ఉపసర్పంచ్ ధరావత్ హర్ష నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, భూరెడ్డి వెంకటరెడ్డి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.