7 June, 2026 | 1:59 AM

శ్రీ వినాయక నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వినతి

07-06-2026 12:00 AM

నాగోల్, జూన్ 6 (విజయక్రాంతి): హయాత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు.

ముఖ్యంగా అంతర్గత అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, మంచినీటి పైప్లైన్, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీవాసుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.