16 May, 2026 | 2:50 AM

సీసీ రోడ్ల సమస్యను పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

16-05-2026 01:21 AM

ఘట్ కేసర్, మే 15 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఘట్కేసర్ మండల మాజీ అధ్యక్షులు, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శుక్రవారం ఎంపీ ఈటల రాజేందర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సమస్యలను శ్రద్ధగా విన్న ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల అవసరాలే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందనే విషయాన్ని మరోసారి చాటిచెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు గొంగళ్ల బాలేష్, బట్టే శంకర్, రాచకట్ల శ్రీశైలం, కొలిచెలిమి సత్యనారాయణ, ఎర్రోళ్ల కుమారస్వామి, సంకు మల్లేష్, గట్టుపల్లి మల్లేష్ ముదిరాజ్, గట్టగల శంకర్, గ్యార చిరంజీవి, రాచకట్ల హరికృష్ణ, బద్దం నాగరాజు, తోటకూరి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.