calender_icon.png 27 January, 2026 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతాంజలిలో రిపబ్లిక్ డే వేడుకలు

27-01-2026 01:30:48 AM

ఖమ్మం, జనవరి26: ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న గీతాంజలి వి ద్యానికేతన్‌లో సోమవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పాఠశాల డైరెక్టర్లు టి.పద్మ, టి.అరుణ్‌లు నివాళులర్పించారు. అనంతం జాతీయ పతాకాన్ని పాఠశాల కరస్పాండెంట్ టీ.వీ అప్పారావు ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.