calender_icon.png 27 January, 2026 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను

27-01-2026 10:53:38 AM

వైకుంఠ రథాన్ని గ్రామపంచాయతీకి అందజేసిన వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి( గ్యాస్)

వెల్దుర్తి,(విజయక్రాంతి): వెల్దుర్తి మండల కేంద్రంలో తన తండ్రి కీశే. వెన్నవరం వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థముగా వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి(గ్యాస్) యశోద దంపతులు  సోమవారం వెల్దుర్తి  గ్రామపంచాయతీకి వైకుంఠ రథం  ఇవ్వడం జరిగింది. పెద్ద గ్రామమైన వెల్దుర్తి మండల కేంద్రంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం పట్టణానికి ఇరువైపులా దహన సంస్కారాలకు  తీసుకువెళ్లడానికి  ఎంతో ఇబ్బంది అవుతుందని  గ్రహించి ప్రజల సౌకర్యార్థం తన తండ్రి జ్ఞాపకార్థంగా 180,000 - / లతో ప్రత్యేకంగా తయారు చేయించి వైకుంఠ రథం ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి (గ్యాస్) దంపతులను వెల్దుర్తి మండల కేంద్ర గ్రామ ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు శ్రీనివాస్ రెడ్డి దంపతులను గ్రామ సర్పంచ్ అలాగే ఉపసర్పంచ్ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి  సర్పంచ్ దండేం ఆదర్శ్,ఉప సర్పంచ్ కమ్మరి శ్రావణ్,  ఈవో బలరాం రెడ్డి, కోదండ కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జగ్గా అశోక్ గౌడ్, శాకారం  శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గం సిబ్బంది, గ్రామ యువకులు పాల్గొన్నారు..