27-01-2026 01:29:46 AM
గుండాల, జనవరి 26 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు అతి ముఖ్యమైన ఘట్టం పగిడిద్దరాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపాలగడ్డ గ్రామం నుంచి సోమవారం అర్రేం వంశస్థులు సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును అంగ రంగ వైభవంగా మేడారానికి తన కళ్యాణికి పయనమయ్యారు.పగిడిద్దరాజు వంశస్థులను సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య, సునీల్ దొర, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, పలువురు ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు.