27-01-2026 10:55:16 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తాటి వాణి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బత్తుల నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తాటి వాణి,ఉపసర్పంచ్ భూక్య మోహన్ రావు లకు ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,పంచాయతీ సెక్రటరీ నాగిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.