27-01-2026 01:32:35 AM
మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్
హైదరాబాద్, జనవరి 26: భారతదేశం ప్రజాస్వామ్యాన్ని,సమానత్వాన్ని, న్యాయాన్ని తన మార్గదర్శక సూత్రాలుగా ఎన్నుకున్న చారిత్రక దినమే గణతంత్ర దినోత్సవమని మన అగ్రిటెక్ అధినేత పాషికంటి రమేష్ అన్నారు. సోమవారంమన అగ్రిటెక్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ హాజరై అక్కడే ఏర్పాటు చేసిన డ్రోన్ మేళా కార్యక్రమాన్ని ఏసీపీ ప్రారంభించారు.తదనంతరం వారు మాట్లాడుతూ భారత పౌరులుగా ప్రతీ ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా,ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మన అగ్రిటెక్ సిబ్బంది పాల్గొన్నారు.