27-01-2026 12:00:00 AM
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో బ్రిటిష్ కబంధహస్తాల నుంచి స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో నాయకులు పోరాటం చేసి స్వాతంత్రం సాధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, మతాలు, కులాల సమూహాలను పాలించేందుకు అవసరమైన చట్టాలను రూపొందించే ప్రక్రియలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన చేసి 1950 జనవరి 26న అమలు చేసుకోవడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పూర్తిగా అధ్యయనం చేసి భారతదేశానికి సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్ర కీలకం. భారతీయులు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా దేశభక్తిని చాటే విధంగా స్వాతంత్ర దిన దినోత్సవ వేడ నిర్వహించుకోవడం ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.